పండగ రోజున 96 తెలుగు రీమేక్ లాంచ్ ?

Published on Apr 2, 2019 10:30 am IST

శర్వానంద్ , సమంత జంటగా కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ’96’ ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు.ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ రీమేక్ కి దర్శకుడు. ఈ చిత్రానికి జాను అనే టైటిల్ ప్రచారం లో వుంది.

ఇక ఈ చిత్రం ఏప్రిల్ 6న ఉగాది రోజున లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల గురించి అధికారికంగా సమాచారం వెలిబడాల్సి వుంది. ప్యూర్ ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి గోవింద్ వసంత సంగీతం అందించనున్నాడు. ఆగస్టు చివర్లో ఈ చిత్రానికి విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. ఇక శర్వా ప్రస్తుతం సుధీర్ వర్మ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉండగా సమంత మజిలీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది.

సంబంధిత సమాచారం :