‘అఆ’ హిందీ వర్షన్ రికార్డు క్రియేట్ చేస్తుంది !

Published on Aug 29, 2018 8:02 pm IST


నితిన్ , సమంత జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం ‘అఆ’. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మించిన ఈచిత్రం 2016లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈచిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.

ఇక తాజాగా ఈ చిత్రాన్ని హిందీలోకి డబ్ చేసి రెండు రోజుల క్రితం యూ ట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఎవరు ఊహించని విధంగా కేవలం 48గంటల్లో 11మిలియన్ వ్యూస్ ను సాధించింది. తెలుగు చిత్రాలను ఇప్పుడు హిందీ ప్రేక్షకులుకూడా బాగా ఆదరిస్తున్నారు. ఇప్పటివరకు సౌత్ నుండి అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు,డి జె’ చిత్రాలు అక్కడ అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించాయి.

సంబంధిత సమాచారం :

X
More