“భీమ్లా” నుంచి ఒకటి బ్యాడ్ న్యూస్, రెండు గుడ్ న్యూస్ లు.!

Published on Feb 11, 2022 10:55 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మాస్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో మేకర్స్ ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ ఇస్తున్నారు. దాదాపు ఈ సినిమా రిలీజ్ ఈ నెలలోనే అని ఫిక్స్ కాగా ఈ సినిమాకి సంబంధించి నిర్మాత నాగ వంశీ లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి.

దీని ప్రకారం అయితే ఒకటి బ్యాడ్ న్యూస్ మరియు రెండు గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. మొదటగా ఈ సినిమా నుంచి అయితే ఇక ఎలాంటి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చెయ్యరట. ఇప్పటికే చాలా చేసాం అని ఇంకో టీజర్ కోసం అయితే కంటెంట్ లేదని తేల్చి చెప్పేసారు. కానీ ఈ సినిమా నుంచి ఇక డైరెక్ట్ ట్రైలర్ మాత్రమే ఉంటుందట.

మరి అలాగే ఇంకో క్రేజీ అప్డేట్ ఏమిటంటే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఏకకాలంలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇది ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. మరి ఈ లెక్కన అనుకున్నట్టుగా ఫిబ్రవరి నెలలో ఈ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి.

సంబంధిత సమాచారం :