“ఆచార్య” నుంచి బ్యూటిఫుల్ సాంగ్ లీక్.?

Published on Apr 25, 2021 11:23 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం “ఆచార్య”. అలాగే ఈ చిత్రంలో మరో కీలక పాత్రల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేలు కూడా నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ముఖ్యంగా మణిశర్మ ఇస్తున్న మ్యూజిక్ ఆల్బమ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. అలా ఇప్పటికే వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా మంచి చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమాలో బ్యూటిఫుల్ నెంబర్ లీక్ అయ్యినట్టుగా టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఇది చరణ్ మరియు పూజాలపై ప్లాన్ చేసిన రొమాంటిక్ సాంగ్ నీలాంబరి అని తెలుస్తుంది. దీనితో ఇది విన్న అభిమానులు ఆ సాంగ్ ను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేసెయ్యాలని కోరుతున్నారు. మరి మేకర్స్ ఈ లీక్ పై ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :