థలపతి విజయ్ నుంచి భారీ అనౌన్స్మెంట్ రానుందా.?

Published on Jun 15, 2021 3:02 pm IST

ఇళయ థలపతి విజయ్ తన గత చిత్రాలు “బిగిల్”, “సర్కార్”, “మాస్టర్” చిత్రాలతో మన తెలుగు మార్కెట్ లో తనకంటూ మంచి స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు తన 65వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. కానీ దానిని మించి మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ను పైగా తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్ గా దర్శకుడు వంశీ పైడిపల్లితో ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.. దీనితో ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఇప్పుడు ఈ చిత్రంపై భారీ అనౌన్సమెంట్ తొందరలోనే రానున్నట్టు తెలుస్తుంది. అది కూడా వచ్చే వారంలోనే కావచ్చని టాక్ ఉంది. మరి ఈ సాలిడ్ కాంబో నుంచి అప్డేట్ ఏ రోజున రానుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తుండగా దానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తుండగా.. విజయ్, వంశీ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించనున్నారు.

సంబంధిత సమాచారం :