
టాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా అత్యంత భారీ బడ్జెట్ తో ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఇప్పటి వరకూ ఈ సినిమాని కేరళ, గోల్కొండ ప్రాంతంలో మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో షూట్ చేసారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ భారీ సెట్ ని నిర్మిస్తున్నారు.
మేము మీకు పైన అందించిన ఫోటోలో ఆ సెట్ కి సంబందించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ షోల్డర్ సర్జరీ వల్ల సినిమాకి షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. త్వరలో మొదలు కానున్న షెడ్యూల్ కోసం టెక్నికల్ టీం సెట్స్ వేసే పనిలో ఉన్నారు. అలాగే మరో వైపు విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్న ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి.
ప్రభాస్, రానా అన్నదమ్ములుగా కనిపించనున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మిస్తున్నారు.