బిగ్ అప్డేట్..”RRR” నార్త్ మరియు ఈ అన్ని హక్కులు వీరికే!

Published on Apr 1, 2021 12:00 pm IST

మన ఇండియన్ బిగ్గెస్ట్ అండ్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో ఒకటైన “రౌద్రం రణం రుధిరం” కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తారక్ మరియు చరణ్ ల కాంబోలో ప్లాన్ చేసిన ఈ చిత్రం శరవేగంగా తెరకెక్కుతుంది. ఇదిలా ఉండగా ఈ గ్యాప్ లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయి బిజినెస్ ను ఈ చిత్రం చేస్తుంది.

మరి లేటెస్ట్ గా వచ్చిన మేకర్స్ నుంచి ఓ బిగ్ అనౌన్న్మెంట్స్ వచ్చింది. ఉత్తరాది ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటివంటి పెన్ స్టూడియోస్ వారు ఈ భారీ ప్రాజెక్ట్ తాలూకా నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్టుగా సగర్వంగా తెలియజేసారు.

అంతే కాకుండా ఈ హక్కులకు గాను ఇండియన్ సినిమాలో ఏ సినిమాకు దక్కని ప్రైస్ దక్కినట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ఈ భారీ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ బిజినెస్ ను జరుపుతుంది. మరి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా స్ట్రామ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13 వరకు ఆగాల్సిందే. మరొకటి..ఈ పెన్ స్టూడియోస్ వారే మాస్ మహారాజ్ రవితేజతో లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “ఖిలాడి” సినిమాను కూడ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :