మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఫంకీ’(Funky) ఫిబ్రవరి 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. దర్శకుడు అనుదీప్ కేవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా పక్కా ప్లానింగ్‌తో చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు.
అయితే, తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ‘ఫంకీ’ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక, ఈ చిత్ర రన్‌టైమ్‌ను కూడా మేకర్స్ లాక్ చేశారు. ఈ చిత్రాన్ని 2 గంటల 8 నిమిషాల క్రిస్పీ రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఇక అన్ని పనులు ముగించుకున్న ‘ఫంకీ’ థియేటర్లలో ప్రేక్షకులకు నవ్వులు పంచేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.


