బజ్..”ఆచార్య” నుంచి బిగ్గెస్ట్ ట్రీట్ అప్పటికి.?

Published on Dec 23, 2021 9:00 am IST

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కోసం అందరికీ తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం మెగా మల్టీ స్టారర్ గా తెరకెక్కి భారీ లెవెల్ అంచనాలు నెలకొల్పుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం పై ఇప్పటికే కొన్ని అప్డేట్స్ వచ్చి మంచి రెస్పాన్స్ ని అందుకోగా ఇప్పుడు వాటిని మించే ఓ బిగ్గెస్ట్ మెగా ట్రీట్ రాబోతుందట.

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ రానున్న కొత్త ఏడాదికి సినిమాలో మెగాస్టార్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లపై కంబైన్డ్ అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా ఓ టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎలాగో ఫిబ్రవరిలోనే రిలీజ్ ఉంది కాబట్టి కొత్త సంవత్సరం కానుకగా ఈ అప్డేట్ వచ్చే అవకాశం లేకపోలేదు.

మరి వేచి చూడాలి ఏం జరగనుంది అనేది. ఇక ఈ భారీ సినిమాలో పూజా హెగ్డే మరియు కాజల్ అగర్వాల్ లు హీరోయిన్స్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు. అలాగే భారీ బడ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :