సరికొత్త సత్యదేవ్ తో ఫీల్ గుడ్ గా “గుర్తుందా శీతాకాలం” ట్రైలర్.!

సరికొత్త సత్యదేవ్ తో ఫీల్ గుడ్ గా “గుర్తుందా శీతాకాలం” ట్రైలర్.!

Published on Dec 3, 2022 12:18 PM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువమంది వెర్సటైల్ నటుల్లో మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజం ని మెప్పించిన టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కూడా ఒకరు. మరి ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి మెప్పించగలిగే ఈ యంగ్ నటుడు చేసిన లేటెస్ట్ చిత్రమే “గుర్తుందా శీతాకాలం”. తాను హీరోగా తమన్నా భాటియా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని అయితే దర్శకుడు ఆర్ నాగశేఖర్ తెరకెక్కించారు.

మరి ఎట్టకేలకు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే అయితే ఇందులో సత్య దేవ్ గత సినిమాలతో పోలిస్తే చాలా కొత్త సత్యదేవ్ ని మనం చూడవచ్చు. బహుశా తన నుంచి హీరోగా మొదటి లవ్ స్టోరీ కూడా ఇదే కావచ్చు కాగా ఈ ట్రైలర్ లో మాత్రం తాను మంచి యంగ్ లుక్స్ లో కనిపించి మంచి ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు.

అలాగే నటుడు ప్రియదర్శితో తన కన్వర్జేషన్ కూడా ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది. చిన్న నాటి నుంచి ఒక సర్టైన్ ఏజ్ వచ్చే వరకు ప్రతి అబ్బాయి లైఫ్ లో లవ్ ఎవరితో ఎంతవరకు నిజం ఎవరితో తన నిజమైన ప్రేమ జీవితం మిగులుతుంది అనే అంశాలు ఫీల్ గుడ్ గా ఉన్నాయి.

అలాగే తమన్నా కూడా మంచి మెచ్యూర్ రోల్ లో కనిపిస్తుంది. ఇంకా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కనిపిస్తుంది. అలాగే ట్రైలర్ లో కాల భైరవ సంగీతం ఆసక్తిగా ఉండగా విజువల్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ 9న విడుదల కానుండగా కొత్త సత్యదేవ్ ని ఓ సరికొత్త కథలో చూడబోతున్నామని డెఫినెట్ గా చెప్పొచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు