ఈ హాట్ బాలీవుడ్ జంటపై ఎఫ్ఐఆర్ నిజమేనట.!

Published on Jun 3, 2021 2:01 pm IST

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ఉదృతి నెమ్మదిస్తుంది.. అయితే ఈ రెండో వేవ్ లో ప్రధానంగా ఎఫెక్ట్ కాబడిన రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే అది మహారాష్ట్ర అనే చెప్పాలి. మరి అలాగే మొత్తం బాలీవుడ్ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి లాక్ డౌన్ మూలాన సినిమాలు కూడా విడుదల కాలేదు. అయితే ఇదిలా ఉండగా ఇదే బాలీవుడ్ కి చెందిన ఓ హాట్ జంటపై కోవిడ్ నిబంధనలు ఉల్లగించినందుకు ముంబై పోలీసులు కేసు పెట్టారన్న వార్త ఒక్కసారిగా వైరల్ అయ్యింది.

వారే “వార్” ఫేమ్ టైగర్ ష్రాఫ్ మరియు బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిలు.. వీరిద్దరూ కరోనా నిబంధనలు ఉల్లంఘించి 2 గంటల సమయం తర్వాత బయటకొచ్చారని అందుకే కేస్ బుక్ చేసారని తెలిసింది. అయితే ఈ వార్త నిజమే అన్నట్టుగా వారి పేర్లను ఎక్కడా మెన్షన్ చెయ్యకుండా ముంబై పోలీసులు పెట్టిన ఓ పోస్ట్ మరింత వైరల్ అవుతుంది.

ప్రస్తుతం కరోనాతో “వార్” జరుగుతున్న సమయంలో బయటకి వచ్చిన ఇద్దరు నటులపై కేసు ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ లో రెండు సెక్షన్స్ కింద కేస్ బుక్ చెయ్యడం జరిగింది అని అది కూడా సరైన కారణాలు తెలపనందున చేసినట్టుగా వారు తెలిపారు. దీనితో అది వారిద్దరే అని కన్ఫర్మ్ అయ్యినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం :