పవన్ సినిమాలో ఈ స్టార్ డైరెక్టర్ రోల్ పై క్లారిటీ వచ్చింది.!

Published on Jun 23, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం షూట్ రీస్టార్ట్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ కూడా ఒక పాత్ర చేస్తున్నారని ఆ మధ్య టాక్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఆ టాక్ నిజమే అని ఇప్పుడు తేలిపోయింది. దానిని స్వయంగా వినాయక్ నే లేటెస్ట్ ఇచ్చిన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు. తాను పవన్, రానా లు చేస్తున్న సినిమాలో చిన్న రోల్ చేసానని అది కూడా ఒక సినిమా డైరెక్టర్ గానే కనిపిస్తానని వినాయక్ క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :