“సర్కారు వారి పాట” అప్డేట్స్ ఎప్పటి నుంచో క్లారిటీ.!

Published on Jun 11, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రాన్ని అదిరే ఎలిమెంట్స్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి సాలిడ్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ కి మేకర్స్ ఇప్పుడు అప్డేట్ ఇచ్చారు.

తాము నెక్స్ట్ స్టార్ట్ చెయ్యబోయే షెడ్యూల్ షూట్ నుంచి ప్రతి అప్డేట్ ను వదులుతామని అప్పటి వరకు ప్రతి ఒకరు కోవిడ్ ప్రోటో కాల్స్ ప్రకారం జాగ్రత్తగా ఉండి వేచి ఉండాలని తెలిపారు. సో అప్పటి వరకు మహేష్ ఫ్యాన్స్ కి ఎదురు చూపులు తప్పవని చెప్పాలి. ఇది వరకే ఈ చిత్రం రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఆపేసిన సంగతి తెలిసిందే. దానిని జూలై నుంచి స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. మరి అప్పటి నుంచి వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :