క్లారిటీ..”సర్కారు వారి పాట” అప్డేట్ ఇప్పుడప్పుడే లేదు.!

Published on Nov 20, 2021 8:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. మహేష్ కెరీర్ లోనే మోస్ట్ స్పెషల్ సినిమాగా దీనిని అభిమానులు ట్రీట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు కూడా సాలిడ్ విజువల్స్ తో ఈ సినిమాని ట్రీట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాడు.

అయితే ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా మినహా టాలీవుడ్ లోని అన్ని సినిమాల అప్డేట్స్ ఏవోటి వస్తున్నాయి. దీనితో అభిమానులు చాలా ఆసక్తిగా ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి దీనిపైనే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ని అడిగితే ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా దానికి చాలా టైం ఉందని అదెప్పుడు వస్తుందో అప్పుడు రచ్చ చేస్తుంది అన్నట్టుగా రిప్లై ఇచ్చారు. సో ఇప్పుడప్పుడే సర్కారు వారి పాట నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చే సూచనలు లేవని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More