తారక్, త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ అప్పుడే అట.!

Published on Apr 7, 2021 3:00 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాజమౌళితో భారీ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇది కంప్లీట్ అయ్యాక తారక్ తన మరో ఫేవరెట్ దర్శకుడు తనకి ఆప్తుడు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో “అయినను పోయి రావలె హస్తినకు” అనే ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయ్యిన సంగతి కూడా తెలిసిందే.

కానీ గత కొన్ని రోజులు నుంచి ఈ కాంబోలో సినిమా ఉందా లేదా అన్న దానిపై టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాపై అసలైన క్లారిటీ ఈ వచ్చే ఏప్రిల్ 13న రానున్నట్టు తెలుస్తుంది. గత కొంత కాలం కిందటే ఉగాదికి ఈ కాంబో నుంచి ఏదొక అప్డేట్ ఉంటుందని విన్నాము. ఇప్పుడు అది నిజమయ్యే ఆస్కారం ఉన్నట్టు టాక్. మరి ఈ అప్డేట్ నిజంగానే ఉందా లేదా అన్నది తెలియాలి అంటే అప్పటికి వరకు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :