పవన్ – హరీష్ చిత్రంపై క్రేజీ అప్డేట్.!

Published on Jun 6, 2021 4:12 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి “గబ్బర్ సింగ్”. అవ్వడానికి రీమేక్ సినిమా అయినా కూడా దర్శకుడు హరీష్ శంకర్ చేసిన మార్పులు చేర్పులకు భారీ వసూళ్లు వచ్చేసాయి. అయితే ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో మరో ప్రాజెక్ట్ అనూన్స్ కాబడింది. మరి ఈ చిత్రం పవన్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ లా నిలుస్తుంది అని హరీష్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.

ముఖ్యంగా మళ్ళీ వింటేజ్ కళ్యాణ్ ని చూపించి పవన్ ఫ్యాన్స్ కు అదిరే ట్రీట్ ఇస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ కోణంలోనే ఈ చిత్రంపై క్రేజీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రం పవన్ లుక్ కానీ హైర్ స్టైలింగ్ గాని గత చిత్రం “వకీల్ సాబ్” కంటే ఎన్నో రెట్లు అదిరిపోతుంది పవన్ పర్సనల్ హైర్ స్టైలిస్ట్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లిప్ ద్వారా తెలిసింది.

దీనితో ఈ టాక్ కాస్త పవన్ అభిమానుల్లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటికే భారీ సెట్ వర్క్స్ కూడా ఈ చిత్రానికి స్టార్ట్ అయ్యాయని తెలిసింది. అలాగే మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే ఆ లుక్ పై ఆల్రెడీ ఫోటో షూట్ కూడా జరిగిందట. దీనితో ఈ చిత్రంపై ఇపుడు మరిన్ని అంచనాలు పెరిగాయి. మరి హరీష్ పవన్ ను ఎలా ప్రెజెంట్ చెయ్యనున్నారో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :