“బిగ్ బాస్ 4” కు ముహూర్తం కుదిరిందా.?

Published on Aug 6, 2020 7:16 pm IST

తెలుగు స్మాల్ స్క్రీన్ వీక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ గ్రాండ్ రియాలిటీ షో “బిగ్ బాస్” సీజన్ 4 మొదలు కానుంది అని అధికారికంగా కన్ఫర్మేషన్ రావడంతో వారికి మళ్ళీ వారి ఎంటర్టైన్మెంట్ తిరిగి వాచినట్టు అయ్యింది. గడిచిన మూడు సీజన్లు ఒకదాన్ని మించి మరొకటి బిగ్గెస్ట్ హిట్ అయ్యాయి. దీనితో సీజన్ 4 కూడా ఎన్నో అంచనాలు నెలకొనగా దానికి కరోనా బ్రేక్ వేసింది. ఇక ఈసారి సీజన్ ఉంటుందా లేదా అన్న సంశయంలో స్టార్ మా వారు టీజర్ తో కన్ఫర్మ్ చేసేసారు.

అలాగే ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునే చేయనున్నారని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ షో లేట్ గా మొదలైనా లేటెస్ట్ గా ఉండేలా ప్లాన్ యాజమాన్యం ప్లాన్ చేస్తుండగా షో ఎప్పుడు మొదలు కానుంది అన్నదానికి సంబంధించి ఎలాంటి సమాచారమూ బయటకు రాలేదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ సారి బిగ్ బాస్ సీజన్ 4 ఈ ఆగష్టు 30 నుంచి టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్టు టాక్. అందుకు సంబంధించి సన్నాహాలు ఇప్పుడు జరుగుతున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More