నాగ చైతన్య కోరిక చాలా పాతదే..

Published on Jun 20, 2019 4:30 pm IST

శేఖర్ కమ్ముల.. తెలుగు సినిమా కమర్షియల్ పంథాలో సాగిపోతున్న తరుణంలో కూడా తన భిన్నమైన శైలితో అందరినీ తనవైపుకు తిప్పుకున్నాడు. కొత్తదనం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన కథలు, టేకింగ్ చూసి చాలా మంది యువ హీరోలు ఆయనతో పనిచేయాలని కోరుకున్నారు. వారిలో నాగచైతన్య కూడా ఉన్నారు.

కెరీర్ ఆరభించినప్పటికి నుండి శేఖర్ కమ్ములతో పనిచేయాలని చైతన్య కోరుకున్నాడట. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరి వీరి సినిమా సెట్ అయింది. సెప్టెంబర్ నుండి షూట్ మొదలుకానుంది. ఇదొక అందమైన లవ్ స్టోరీ అని చైతన్య చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం తనకు మంచి టైమ్ నడుస్తుందని అన్నారు. దీన్నిబట్టే ఈ ప్రాజెక్ట్ చేయడం చైతన్యకు ఎంత ఉత్సాహంగా ఉందో అర్థమవుతోంది. ఇకపోతే సునీల్ నారంగ్ నిర్మించనున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయకిగా నటించనుంది.

సంబంధిత సమాచారం :

X
More