గెట్ రెడీ..ఆ నెలలో “పుష్ప” నుంచి ఏదో ఫీస్ట్ కన్ఫర్మ్.!

Published on Aug 7, 2021 9:00 am IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ సినిమా “పుష్ప ది రైజ్” పై ఇప్పుడు అంచనాలు మెల్లమెల్లగా హై లెవెల్ కి చేరుకుంటున్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి మ్యూజికల్ అప్డేట్స్ ని కూడా మేకర్స్ స్టార్ట్ చేసేసి ఒక్కో రోజు ఒక్కో భాష ఫస్ట్ సింగిల్ పై సాలిడ్ అప్డేట్స్ హింట్స్ ఇస్తూ వస్తున్నారు.

అలా ఇప్పుడు హిందీ సింగిల్ పై అప్డేట్ వస్తుండగా ఈ చిత్రంలో హిందీ సాంగ్ పాడిన బాలీవుడ్ స్టార్ సింగర్ కం స్టార్ కంపోజర్ విశాల్ దద్లాని ఇంట్రెస్టింగ్ ఇన్ఫో రివీల్ చేసేసాడు. రేపు అంటే ఈరోజు నీ ఫ్లై అవుతుంది. కానీ సెప్టెంబర్ ఇద్దరం కలిసి ఫ్లై అవుదాం అంటూ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ రివీల్ చేసేసాడు.

దీనితో సెప్టెంబర్ లో కూడా ఏదో ఫీస్ట్ ని మేకర్స్ కన్ఫర్మ్ చేసారని అర్ధం అవుతుంది. అంతే కాకుండా వారేం ప్లాన్ చేసారా అని అభిమానుల్లో కూడా చర్చ మొదలయ్యింది.. అయితే ఇది ఈ ఇద్దరి మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యలోది కాబట్టి ఖచ్చితంగా సంగీతం పరంగానే ఏదో అప్డేట్ అయ్యి ఉండొచ్చు.. సో ఆ మ్యూజికల్ ఫీస్ట్ ఏంటి అన్నది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :