వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తెలుగు యువహీరోల్లో తనదంటూ ఒక మార్క్ సెట్ చేసుకుంటూ వెళుతోన్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళుతోన్న ఈ హీరో తమిళ, మళయాలంలో బంపర్ హిట్ కొట్టిన ‘నేరమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రన్ అనే టైటిల్ ఫిక్స్ చేసి నిన్న సాయంత్రం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ ఫస్ట్‌లుక్‌తో విపరీతంగా ఆకట్టుకున్న టీమ్, ఆ వెంటనే ఓ స్పెషల్ టీజర్‌ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేసి మరింతగా ఆకట్టుకుంటోంది.
పాత్రల పరిచయం పేరుతో విడుదలైన ఈ టీజర్‌లో ‘టైమ్’నే హీరోగా, విలన్‌గా పరిచయంతో పాటు కథను మలుపు తిప్పే పలు అంశాలను పాత్రలుగా పరిచయ చేస్తూ చెప్పడం చాలా కొత్తగా ఉంది. కథ ప్రకారంగా సినిమా మొత్తం టైమ్ చుట్టూ తిరుగుతూంటుంది. ఈ టైమ్‌లోనే హీరో దేనికోసం పరిగెత్తాడూ? అన్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి టీజర్ మరొకటి విడుదల కానుంది.
ఇక అలా వచ్చిన టైటిల్స్ నుంచే ‘రన్’, ‘123’, ‘టైమ్ బాబూ టైమ్’, ‘జిందగీ’, ‘నాకూ టైమ్ వచ్చింది’ లాంటి ఐదు టైటిల్స్‌ను ఫైనల్ చేశారు. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. సందీప్ కిషన్ సరసన అనీషా ఆంబ్రోస్ హీరోయిన్‌గా నటించారు. మార్చి 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


