‘వరుడు కావలెను‘ టీజర్ కి డేట్ ఫిక్స్ !

Published on Aug 29, 2021 6:05 pm IST

యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా ‘రీతువర్మ’ నాయికగా ‘లక్ష్మీ సౌజన్య’ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. కాగా తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఆగస్టు 31న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్ అండ్ ప్రచారాలకు ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అయింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా మేకర్స్ సినిమాని తీసుకురాబోతున్నారట.

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ లో రాబోతున్న ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి.

సంబంధిత సమాచారం :