‘వారణాసి’ గ్రాండ్ ప్లాన్.. యూఎస్ లో 2000 థియేటర్స్ లో ఊహించని రీతి రిలీజ్?

Varanasi

ఇప్పుడు ఇండియన్ సినిమా నుంచి వస్తున్న చిత్రాల్లో ప్రపంచ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదైనా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అలాగే గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ చిత్రం వారణాసి (Varanasi) అనే చెప్పాలి. అప్డేట్లు మొదలవ్వట్లేదు అని డల్ గా ఉన్న ఫ్యాన్స్ ని ఇప్పుడు జక్కన్న ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు.

అప్పటి వరకు తనని తాను కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కసారిగా ఇంటర్నేషనల్ ఎంట్రీ ఇస్తుండడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అందుకు తగ్గట్టుగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకి ప్లానింగ్స్ జరుగుతూ ఉండగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ చిత్రానికి ఊహించని ప్లానింగ్స్ జరుగుతున్నట్టు ఇప్పుడు తెలుస్తుంది.

ముఖ్యంగా ఒక్క యూఎస్ మార్కెట్ లోనే ఊహించని రీతి రిలీజ్ ని ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారట. అక్కడ ఏకంగా 2000 కి పైగా థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు టాక్. ఇది ఇండియన్ సినిమా నుంచి మాత్రమే కాకుండా నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో బిగ్గెస్ట్ రిలీజ్ అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి మాత్రం ప్రపంచ సినిమా దగ్గర ‘వారణాసి’ ఎంట్రీ ఎవ్వరూ ఊహించని విధంగానే ఉండేలా ఉందని చెప్పవచ్చు.

Exit mobile version