నైజాంలో భారీ డీల్ పూర్తి చేసుకున్న “కల్కి 2898ఎడి”!?

నైజాంలో భారీ డీల్ పూర్తి చేసుకున్న “కల్కి 2898ఎడి”!?

Published on Mar 29, 2024 8:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకోణ్ అలాగే దిశా పటాని లు ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న వరల్డ్ లెవెల్ చిత్రం “కల్కి 2898 ఎడి”. మరి ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బిజినెస్ కి సంబంధించి సాలిడ్ బజ్ రీసెంట్ గా వినిపిస్తుంది.

జస్ట్ ఓటిటి హక్కులతోనే సగం బడ్జెట్ మేర అందుకోగా ఇప్పుడు థియేట్రికల్ గా కూడా భారీ లెవెల్లో బిజినెస్ ని ఈ చిత్రం చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం నైజాం ఏరియాలో ఈ సినిమాకి భారీ మొత్తంలో 70 కోట్లకి పైగా హక్కులు అమ్ముడుపోయినట్టుగా వినిపిస్తుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కల్కి హక్కులు ఈ ఫ్యాన్సీ ధర ఇచ్చి కొనుగోలు చేసినట్టుగా టాక్.

మరి ఒక్క నైజాంలోనే ఈ రేంజ్ లో ఉంటే టోటల్ తెలుగు రాష్ట్రాల్లో హక్కులు ఈజీగా 150 కోట్ల పైమాటే ఉంటాయని చెప్పాలి. మరి వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు