బ్రేక్ లేకుండా పనిచేయనున్న ఎన్టీఆర్ !

బ్రేక్ లేకుండా పనిచేయనున్న ఎన్టీఆర్ !

Published on Jun 4, 2018 8:24 AM IST

ఇప్పటికే షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ చిత్రం ఈరోజు నుండి మూడవ షెడ్యూల్ ను మొదలుపెట్టుకోనుంది. ఈ భారీ షెడ్యూల్ ఈరోజు నుండి ఈ నెలాఖరు వరకు నిర్విరామంగా జరగనుంది. ఎన్టీఆర్ తో పాటు పలువురు ముఖ్య తారాగణం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ షెడ్యూల్లో పాల్గొననున్నారు.

ఈ షెడ్యూల్ తో సినిమా సగానికి పైగా పూర్తికానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఉండబోతున్న ఈ చిత్రంలో తారక్ సిక్స్ ప్యాక్ లుక్లో కనిపించనున్నాడు. త్రివిక్రమ్ తొలిసారి ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు