సమంతాకి సపోర్ట్ గా ట్రెండ్..ఇందుకోసమేనా.?

Published on Jun 3, 2021 8:00 am IST

మన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో సమంతా అక్కినేని కూడా ఒకరు. గ్లామరస్ రోల్స్ నుంచి తనకంటూ స్పెషల్ క్రేజ్ ను సెట్ చేసుకుంది ఈ హీరోయిన్. అయితే సామ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలుతో పాటుగా ఇండియన్ వైడ్ ఎంటర్టైన్మెంట్ వీక్షకులు తాను చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోస్ట్ అవైటెడ్ గా నిలిచిన ఈ సీజన్లో సమంతా ఒక అవుట్ స్టాండింగ్ నెగిటివ్ రోల్ ఫస్ట్ టైం పోషిస్తుంది. దీనితో ఈ రోల్ ఎలా ఉండనుంది అన్న ఆసక్తి ట్రైలర్ వచ్చిన తర్వాత నుంచి మొదలైంది. కానీ అక్కడ నుంచే సామ్ కి నెగిటివిటీ సెగ కూడా తగిలింది. మరి ఇప్పుడు ఆ సిరీస్ విడుదల దగ్గర పడుతున్న సందర్భంలో సామ్ ఫాలోవర్స్ ఆమెకి అండగా ఉన్నట్టుగా సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

అయితే దీనికి కారణం కూడా ఈ సిరీస్ నే అన్నట్టు తెలుస్తుంది. కోలీవుడ్ ఆడియెన్స్ ఈ సిరీస్ కు సామ్ కు ఇంకా తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుండగా మిగతా వారు అంతా విడుదల కాకముందే ఎలా ఓ నిర్ణయానికి వస్తారని పాజిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సిరీస్ ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఈ ఒక్కరోజు ఎదురు చూస్తే చాలు.

సంబంధిత సమాచారం :