టాక్..”రాధే శ్యామ్” కి కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.?

Published on Jan 6, 2022 7:03 am IST


నిన్ననే టాలీవుడ్ కి చెందిన మరో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రాధే శ్యామ్” కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు పూజా హెగ్డే లు హీరోయిన్స్ గా నటించిన ఈ భారీ సినిమాని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన దాదాపు మూడేళ్ళ నుంచి అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయినా ఎలాగో ఫైనల్ గా ఈ సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది. ఏం చేస్తాం పరిస్థితులు ఇలా ఉన్నాయని అంతా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కి సంబంధించి ఆసక్తికర టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఈ సినిమాని మేకర్స్ వచ్చే మార్చ్ నెలలో రిలీజ్ చెయ్యాలని భావిస్తున్నారట. మరి దీనికి సంబంధించి మార్చ్ 18వ తేదీ ప్రస్తుతానికి పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ కనుక మళ్ళీ దేశంలో పరిస్థితులు కాస్త మెరుగు పడితే అప్పుడు రిలీజ్ చేసే ఛాన్స్ ఉందట. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది అనేది.

సంబంధిత సమాచారం :