ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో ఓ స్టాండప్ కమెడియన్ చేసిన పర్శనల్ లైఫ్ కామెంట్స్ ఏ రీతిలో కాంట్రవర్సీకి దారి తీశాయి అనేది అందరికీ తెలిసిందే. అయితే ఆ మేటర్ అతను క్షమాపణ చెప్పడంతో ముగిసింది అని చాలామంది అనుకున్నారు కానీ నిజానికి అక్కడ తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదిలి ఊహించని మలుపులు తిరుగుతుంది.
సోషల్ మీడియాలో ఓ పక్క మరింతమంది స్టాండప్ కమెడియన్స్ అనుదీప్ కి సపోర్ట్ గా నిలవడం ఒకెత్తు అయితే ఇప్పుడు పవన్ విషయంలో పర్శనల్ కామెంట్స్ చేసిన మరికొందరు మరికొందరు పేర్లు బయటకి రావడం వారి హిస్టరీ ఫాలోవర్స్ పట్ల దురుసు ప్రవర్తన వంటివి వైరల్ గా మారుతున్నాయి.
దీనితో ఒక హీరోగానే కాకుండా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ పై అటువంటి కామెంట్స్ చేస్తున్న వీరిపై కూడా యాక్షన్ తీసుకోవాలని అభిమానులు కోరుతున్నారు. దీనితో ఈ స్టాండప్ కమెడియన్స్ కాంట్రవర్సీ కొత్త టర్న్ తీసుకుంది అని చెప్పాలి.


