మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాల లైనప్ ని సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు కొరటాల శివతో చేయాల్సి ఉన్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం దేవర 2 కూడా ఒకటి. పార్ట్ 1 మంచి సక్సెస్ సాధించగా పార్ట్ 2 కోసం అభిమానులు ఎదుర్క్ చూసారు. మరి ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి మధ్యలో కొంచెం గందరగోళం వాతావరణం కూడా నెలకొంది.
ఇలా సీక్వెల్ ఉంది లేదు అంటూనే కొంత కాలం గడిచాక తర్వాత దాదాపు సినిమా లేదనే టాక్ స్థిరపడిపోయింది. కానీ లేటెస్ట్ గా మళ్ళీ మారిన సమీకరణాలుతో దేవర 2 మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్టుగా కొత్త ట్విస్ట్ వినిపిస్తుంది. ఈసారి కొరటాల ప్రిపేర్ చేసిన వెర్షన్ తారక్ కి నచ్చినట్టే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో మళ్ళీ ట్విస్ట్ ఇస్తూ దేవర ఆగమనం గ్యారెంటీ అన్నట్టే ఇప్పుడు వినికిడి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది అధికారిక ప్రకటన వస్తే కానీ ఓ క్లారిటీ రాదు.


