“కేజీయఫ్ 2” రిలీజ్ డేట్ పై సరికొత్త వెర్షన్.!

Published on Jun 3, 2021 3:03 pm IST

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. దేశ వ్యాప్తంగా భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం విడుదల ఎప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ తరుణంలోనే మేకర్స్ నుంచి వస్తున్న అప్డేట్స్ రీత్యా ఈ చిత్రాన్ని మేకర్స్ అనుకున్న జూలై 16 కె ఫిక్స్ చేసారని అర్ధం అయ్యింది.

కానీ మరోపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సరైన ప్రమోషన్స్ లేకుండా ఆన్ టైం రిలీజ్ ఉంటుందా అన్న డౌట్ కూడా ఉంది. కేవలం ఈ నెలన్నర వ్యవధిలో ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ ఇవన్నీ చేయాలంటే చాలా సమయమే పడుతుంది. మరి ఇవన్నీ దాటి జూలై 16 కే రిలీజ్ అంటే అసాధ్యమే అని చెప్పాలి. అందుకే కేజీయఫ్ 2 సరికొత్త విడుదల తేదీని ఆ రోజున ప్రకటించనున్నారని సరికొత్త వెర్షన్ ఇపుడు బయటకి వచ్చింది.. మరి ఇందులో ఎంత వరకు నిజముందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :