బాలయ్య – అనీల్ కాంబోపై సరైన క్లారిటీ వచ్చేసిందిగా.!

Published on Jun 12, 2021 4:00 pm IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం “అఖండ” అనే చిత్రం తన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో హాటిక్ చిత్రంగా చేస్తున్నారు. ఇక దీని తర్వాత నుంచి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పర్ఫెక్ట్ లైనప్ తో బాలయ్య రంగంలోకి దిగాడని రెడీ అయ్యిపోయారు. అలా మొన్న తన పుట్టినరోజు సందర్భంగానే మరో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో అనౌన్స్ చేసేసారు.

అయితే ఆరోజునే మరో టాప్ దర్శకుడు అనీల్ రావిపూడితో చిత్రంపై కూడా క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ ఆ అనౌన్సమెంట్ రాకపోవడంతో సరికొత్త అనుమానాలు మొదలయ్యాయి. మరి ఇప్పుడు ఈ మోస్ట్ అవైటెడ్ కాంబోపై స్వయంగా బాలయ్యనే క్లారిటీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

తాజాగా తన అభిమానులతో నిర్వహించిన జూమ్ మీట్ లో తాను అనీల్ రావిపూడితో సినిమా చేస్తున్నానని తన లైనప్ లో ఈ దర్శకుడు కూడా ఉన్నాడని చెప్పేసారు. అలాగే ఇలా మరిన్ని మంచి ప్రాజెక్ట్స్ చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ నే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో బాలయ్య అభిమానులు ఈ కాంబోపై హోప్స్ పదిలంగానే ఉంచుకోవచ్చని చెప్పాలి.

సంబంధిత సమాచారం :