యంగ్ టైగర్ నుంచి సిసలైన మాస్ ఆల్బమ్ పడబోతోందా.!

Published on Jun 6, 2021 11:43 am IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అనంతరం కూడా తారక్ సాలిడ్ లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు. అయితే వాటిలో మొదటగా చేసేది మాత్రం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో ప్లాన్ చేసిన చిత్రం. వీరి కాంబోలో రానున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంతే స్థాయి అంచనాలు నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంపై లేటెస్ట్ బజ్ ఒకటి బాగా వినిపిస్తుంది. ఈ చిత్రానికి గాను యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నే ఫైనల్ అయ్యినట్టు తెలుస్తుంది. అనిరుద్ ఎలాంటి మాస్ ఆల్బమ్స్ ఇస్తాడో తెలిసిందే.. అలాగే తారక్ కూడా మాస్ లో మరో లెవెల్ ని చూపిస్తాడు. మరి అలాంటిది ఈ ఇద్దరి కాంబోలో సినిమా పడుతుంది అంటే ఆ ఆల్బమ్ ఖచ్చితంగా బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అవుతుంది అని చెప్పాలి. కాకపోతే ఆ సమయం ఎప్పుడు వస్తుందో అంత వరకు ఎదురు చూడక తప్పదు మరి.

సంబంధిత సమాచారం :