రెహమాన్ స్పెషల్ ‘ఐ’ స్క్రీనింగ్

రెహమాన్ స్పెషల్ ‘ఐ’ స్క్రీనింగ్

Published on Jan 17, 2015 2:19 PM IST

ar-rahaman

ఆస్కార్ అవార్డు గ్రహిత ఏ.ఆర్ రెహమాన్ స్వరపరిచిన స్వరాలు ‘ఐ’ చిత్ర ఓపెనింగ్స్ కి ఒక కారణంగా నిలిచాయి. ప్రీ రిలీజ్ కి ముందు సినిమాపై ఆసక్తిని, అంచనాలను రేకెత్తించడానికి రెహమాన్ స్వరాలు చాలా ఒపయోగపడ్డాయి. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దుమ్ము రేపుతుంది. రెహమాన్ కూడా తన వంతు బాధ్యతగా ప్రచారం చేస్తున్నాడు

కష్టపరిస్థితులలో తన తల్లికి వైద్య సహకారాన్ని అందించిన డాక్టర్లకు, వారి కుటుంబ సభ్యలకు ఒక స్పెషల్ షో రెహమాన్ ప్రదర్శించనున్నాడు. తన అతిదులకోసం ఒక థియేటర్ ని మొత్తం బుక్ చేశాడు. విక్రమ్ నటన, శంకర్ గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాను నిలబెట్టేందుకు సహకరిస్తున్నాయి. వచ్చే వారాలలో సైతం ఈ సినిమాకు తిరుగులేనట్టు తెలుస్తుంది

తాజా వార్తలు