పాపం పిల్లాడి మంచి కోసమే చెప్పిన సోనూ సూద్.!

Published on Aug 6, 2020 10:06 pm IST


తాను చేసేది నెగిటివ్ రోల్స్ అయినా సరే ఒక వ్యక్తిగా మాత్రం విపరీతమైన పాజిటివ్ ఒపీనియన్ ను తెచ్చుకున్నాడు నటుడు సోనూ సూద్. ఇప్పుడు మన దేశంలోనే సోనూ సూద్ పేరు తెలియని వారు ఉండరేమో..దేశంలో ఊహించని విపత్కర పరిస్థితి నెలకొనడంతో పనులు లేక ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు తన వంతుగా లేదనకుండా సహాయం అందిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎంతో మందికి సోను సూద్ కు ఇప్పుడు ఒక వింతైన ఘటన ఎదురైంది. అయితే అది కాస్త ఆశ్చర్యకరంగానే ఉన్నా సోనూ మాత్రం దాన్ని చాలా సింపుల్ గా తీసుకొని సమాధానం ఇచ్చారు. ఎవరికైనా సహాయం కావాలీ అంటే సోషల్ మీడియా ద్వారానే సోనూను సంప్రదిస్తున్నారు. అలా లేటెస్ట్ గా ఒక పిల్లవాడు సోనూ కు ట్వీట్ ద్వారా..

“ఈ లాక్ డౌన్ లో తన తోటి పిల్లలు అందరూ పిఎస్4 లో ఆడుకుంటున్నారని తనకి కూడా ఒక పిఎస్4 కొనివ్వగలరా” అని అడిగాడు. దానికి గాను సోనూ ఇచ్చిన సమాధానం అద్భుతం అని చెప్పాలి. “ఈ వయసు లో నీకు పిఎస్4 లాంటి గేమింగ్ డివైజ్ లేకపోవడం మంచిదే.కొన్ని పుస్తకాలు తీసుకొని చదువు. లేదా అవి నేను పంపిస్తా” అని సోనూ తెలిపారు. దీనితో ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More