ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అభిమానులు అలాగే మెగా ఫ్యాన్స్ అంతా కూడా మన శంకర వరప్రసాద్ గారు మేనియాలో ఉన్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అదరగొడుతుండగా ఇప్పుడు దీని తర్వాత మెగాస్టార్ లైనప్ లో మరో షాకింగ్ కాంబినేషన్ ఉన్నట్టుగా బయటికి వచ్చింది.
లేటెస్ట్ గా భారీ చిత్రం ది రాజా సాబ్ తో వచ్చిన దర్శకుడు మారుతీ అసలు విషయం రివీల్ చేశారు. తాను మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో ఈ ఊహించని కలయిక ఇప్పుడు సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతానికి అయితే అంత సానుకూల రెస్పాన్స్ ఈ కాంబినేషన్ పై వినిపించడం లేదు. మరి ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ప్రస్తుతం మెగాస్టార్ యువ దర్శకులు బాబీ, వశిష్ఠ అలాగే శ్రీకాంత్ ఓదెల లతో మొత్తం మూడు సినిమాలు లైనప్ లో ఎంచుకున్న సంగతి తెలిసిందే.


