రికార్డ్స్ సెట్ చేసిన మోహన్ లాల్ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్!

రికార్డ్స్ సెట్ చేసిన మోహన్ లాల్ సినిమాకి షాకింగ్ రెస్పాన్స్!

Published on Dec 26, 2025 9:00 AM IST

Vrushabha

ఈ ఏడాదిలో మలయాళ సినిమా బిగ్గెస్ట్ స్టార్స్ లో ఒకరైన మోహన్ లాల్ నటించిన సినిమాలు ఏ రేంజ్ లో డబ్బులు చేశాయో అందరికీ తెలిసిందే. మరి తాను నటించిన ఎంపురాన్ సినిమా సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తే దాని తర్వాత వచ్చిన తుడరుం కూడా సాలిడ్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన హృదయపూర్వం కూడా మంచి పెర్ఫామెన్స్ చేసింది. ఇలాంటి వరుస సక్సెస్ లు అందుకున్న మోహన్ లాల్ కి ఇదే ఏడాదిలో మరో షాక్ తగిలింది అని చెప్పాలి.

తాను నటించిన సినిమా “వృషభ” ఇప్పుడు థియేటర్స్ లోకి వచ్చింది. కానీ అనూహ్యంగా ఈ సినిమాకి వాటిలో సగం కాదు కదా సగానికి సగం కూడా ఓపెనింగ్స్ రాకపోవడం ట్రేడ్ సర్కిల్స్ లో షాక్ గా మారింది. ముఖ్యంగా మలయాళ ఆడియెన్స్ నే ఈ సినిమా పట్ల ఆసక్తి చూపకపోవడం అనేది మరింత షాకింగ్ అంశం. అంత పెద్ద హిట్స్ అది కూడా ఈ ఏడాదిలోనే ఇచ్చిన స్టార్ హీరో సినిమాకి ఇంత తక్కువ ఓపెనింగ్స్ రావడం అనేది కూడా ఇతర ఇండస్ట్రీ ఆడియెన్స్ లో కూడా చర్చకి దారి తీసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు