‘ది రాజా సాబ్’కి కూడా షాకింగ్ రన్ టైం?

‘ది రాజా సాబ్’కి కూడా షాకింగ్ రన్ టైం?

Published on Dec 2, 2025 11:19 AM IST

The-Raja-Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రం “ది రాజా సాబ్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్ నటిస్తుండగా రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా ఫుల్ లెంగ్త్ రన్ టైం పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమా కూడా 3 గంటల పైగానే నిడివితో రాబోతుందట. మేకర్స్ ఇప్పుడు వరకు తెరకెక్కించిన ఫుటేజ్ నే చాలా ఎక్కువ వచ్చింది అని ఆ మధ్య తెలిపారు. ఇక అందులో ఫైనల్ కట్ గా మొత్తం 3 గంటల 15 నిమిషాలకి సినిమాని తీసుకొస్తున్నట్టుగా సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు