సుశాంత్ ని హత్య చేశారంటూ బయటికి వచ్చిన షాకింగ్ వీడియో.

Published on Aug 4, 2020 7:50 am IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్ లో సంచలనంగా మారగా ఈ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. తాజాగా రక్షణ శాఖ ఆర్డినెన్స్ ఆసుపత్రిలో పని చేసే ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మృతిపై ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని.. హత్యేనంటూ అందులో ఆమె పేర్కొన్నారు.

సుశాంత్ ముఖంతో పాటు ఇతర ప్రదేశాల్లో గాయాలున్నాయని.. అతన్ని కొట్టి చంపి.. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని మీనాక్షి మిశ్రా అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మరోవైపు అసలు సుశాంత్ ది ఆత్మహత్య కాదని.. హత్యేనని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెబుతున్నారు. ఇక సుశాంత్ తండ్రి కే కే సింగ్ రియా చక్రవర్తిపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమెను బీహార్ పోలీసుకు అరెస్ట్ చేయాలకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

More