ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న రామ్

ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్న రామ్

Published on May 31, 2015 12:50 AM IST

ram
వరుసపెట్టి పరాజయాల బాటలో పయనిస్తున్న యువ హీరో రామ్ నటించిన తాజా చిత్రం ‘పండగ చేస్కో’ నిన్న విడుదలైంది . విడుదలైన నాటి నుండీ మంచి రెస్పాన్స్ దక్కడంతో రామ్ ఊపిరి పీల్చుకున్నాడు. సినిమాలో ఎంటర్టైన్మెంట్ శాతం ఎక్కడా తగ్గకుండా దర్శకుడు గోపీచంద్ జాగ్రత్త పడ్డాడు. నటీనటుల పెర్ఫార్మెన్స్, తమన్ సంగీతం మాస్ ప్రేక్షకులను అలరించింది.

రామ్ కొత్త లుక్, ఎనర్జీ లెవల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొదటిరోజు కలెక్షన్లను పరిశీలిస్తే రామ్ ఎదురుచూస్తున్న విజయం ఈ సినిమాతో దక్కినట్టే అని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. వాటి షూటింగ్ లో బిజీగా వున్నాడు.

తాజా వార్తలు