లేటెస్ట్..నానీ నుంచి సాలిడ్ అనౌన్స్మెంట్.!

Published on Aug 26, 2021 12:45 pm IST


నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “టక్ జగదీష్” కూడా ఒకటి. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం టాలీవుడ్ ఆడియెన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో నేరుగా విడుదల కాబోతుండడం ఫిక్స్ కావడంతో కాస్త గందరగోళం ఆ మధ్య నెలకొంది. కానీ ఎట్టకేలకు దానిపై వివరణ కూడా వచ్చింది.

మరి ఇదిలా ఉండగా ఇంకా ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా అనౌన్స్ కాలేదు. అయితే దానిపైనే ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని నానీ రేపు ఇవ్వనున్నట్టుగా హింట్ ఇచ్చాడు. దీనితో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ మాసివ్ అనౌన్సమెంట్ కి తెర పడ్డట్టు అయ్యిందని చెప్పాలి. మరి ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :