“భీమ్లా నాయక్” నుంచి వారికి కావాల్సిన ఆన్సర్ కి టైం ఫిక్స్?

Published on Aug 20, 2021 7:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి లేటెస్ట్ చిత్రాల్లో మాస్ రీమేక్ “భీమ్లా నాయక్” కూడా ఒకటి. మళయాళ చిత్రం అయ్యప్పణం కోషియం కి రీమేక్ గా దీనిని దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మరి భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం నుంచి ఇది వరకే పవన్ పై వచ్చిన వీడియో కి భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా అక్కడ నుంచి ఈ సినిమా హైప్ ఇంకో లెవెల్ కి వెళ్లింది. అయితే ఈ వీడియో తో పాటే ఆ టైం లో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

ఇద్దరు హీరోలకి సమానమైన ఇంపార్టెన్స్ ఈ సినిమాలో ఉన్నప్పుడు ఒక హీరోనే హైలైట్ చెయ్యడం ఏమిటి అని.. అయితే దీనిపై నిర్మాత నాగవంశీ కూడా ఒక సాలిడ్ క్లారిటీ కూడా ఇచ్చారు. అయినా కూడా ఈ విషయంలో కామెంట్స్ ఇంకా వస్తున్న నేపథ్యంలో వారి అందరికీ కూడా ఆన్సర్ ఇచ్చే అప్డేట్ తో మేకర్స్ మళ్లీ సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది. ముందుగా భీమ్లా పై వీడియో ని వదిలిన మేకర్స్ ఈసారి రానా చేస్తున్న డాని.. డానియల్ శేఖర్ వీడియో కట్ ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట. మరో బహుశా అది రానున్న రెండు వారాల్లో బయటకి రావొచ్చని సమాచారం.. ఇక మరి అదెలా ఉంటుందో అన్నది వేచి చూడాలి..

సంబంధిత సమాచారం :