తారక్ ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై వచ్చేసిన క్లారిటీ.!

Published on May 12, 2021 9:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ టాప్ హీరోలు చేస్తున్న ప్రెజెంట్ చిత్రాల కంటే వాటి తర్వాత చెయ్యబోయే సినిమాల కోసం మోస్ట్లీ ప్రతీ హీరో అభిమాని ఎదురు చూస్తున్నాడు. అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” కాకుండా దాని తర్వాత లైన్ లో ఉన్న మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అదే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన చిత్రం. ఇక ఈ చిత్రంపై ఆ మధ్యన ఎలాంటి ప్రకంపనలు వచ్చాయో కూడా చూసాము. కానీ మెల్లగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కాస్తా పక్కకు వెళ్లి ఏకంగా ఆగిపోయింది అన్న రూమర్స్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు డైరెక్ట్ తారక్ నుంచి తుది క్లారిటీ వచ్చేసింది.

కొరటాల సినిమా అయ్యిన తర్వాత ప్రశాంత్ నీల్ తో అనుకున్న చిత్రం కూడా ఉందని ఓ ప్రముఖ హాలీవుడ్ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా కన్ఫర్మ్ చెయ్యడంతో ఈ ప్రాజెక్ట్ ఆగలేదని తెలిసింది. మరి దీనితో ఈ టాక్ తెలిసిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఈ సెన్సేషనల్ మాస్ కాంబోపై మరిన్ని అంచనాలు సెట్ చేసుకున్నారు.

సంబంధిత సమాచారం :