బళ్ళెం ఎక్కుపెట్టిన గొండు బెబ్బులిగా తారక్ వచ్చేసాడు.!

Published on May 20, 2021 10:18 am IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అంతా సోషల్ మీడియాలో తారక్ బర్త్ డే వేడుకలతో హోరెత్తిస్తున్నారు. మరి ఇదే మాస్ పవర్ ఫుల్ రోజున తారక్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” నుంచి ఇంటెన్స్ పోస్టర్ విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ చెప్పారు.

మరి ఈ రోజు ఉదయం 10 గంటలకు గొండు బెబ్బులి కొమురం భీం గా తారక్ కొత్త లుక్ ను విడుదల చేస్తామని తెలిపారు. కానీ ఇంతకు ముందు పలు మార్లు జరిగినట్టు గానే భీం కొత్త పోస్టర్ ను కూడా ఆన్ టైం కి విడుదల చేయలేకపోయారు. దీనితో తారక్ అభిమానుల ఎగ్జైట్మెంట్ చిత్ర యూనిట్ కాస్త బ్రేక్ ఇచ్చినట్టు అయ్యింది.

కానీ ఎట్టకేలకు స్వల్ప విరామంతో అంచనాలను ఏమాత్రం తగ్గకుండా సాలిడ్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేసారు. లక్ష్యాన్ని బళ్ళెంతో గురి పెట్టిన గొండు బెబ్బులి కొమురం భీం గా సరికొత్త మేకోవర్ లో విడుదల చేసిన ఈ పోస్టర్ ఫీస్ట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. మొదటి నుంచి చూపిస్తున్న నీటికి ప్రతీకలా మొత్తం నీలి వర్ణంతో సిద్ధం చేసిన ఈ పోస్టర్ కు ఇపుడు భారీ రెస్పాన్స్ వస్తుంది. మరి సినిమాలో తారక్ నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :