నాని సినిమాకు భారీ బడ్జెట్ తో సాలిడ్ సెట్.!

Published on Apr 18, 2021 7:09 pm IST

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం “టక్ జగదీష్” ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అయ్యి వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి అలాగే దీనితో పాటుగా మార్ ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని కూడా నాని చేస్తున్నాడు. అదే “శ్యామ్ సింగ రాయ్”. టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

ఆ మధ్య నాని పై వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ పై సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఓ కీలక షెడ్యూల్ కు గాను ఏకంగా ఆరున్నర కోట్ల ఖర్చు ఓ భారీ సెట్ ను వేస్తున్నారట.

మరి ఇంత గట్టిగా ప్లాన్ చేస్తున్నారంటే ఎలాంటి సీన్స్ ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇక ఈ చిత్రంలో నాని సరసన సాయి పల్లవి మరియు కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ వింటేజ్ డ్రామాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా నిహారికా ఎంటర్టైన్మెంట్స్ వారు నాని కెరీర్ లోనే ఏ సినిమాకు లేనంత బడ్జెట్ వెచ్చిస్తున్నారు.

సంబంధిత సమాచారం :