మెగాస్టార్ మాస్ రీమేక్ కు అదిరే టైటిల్.?

Published on Apr 12, 2021 4:00 pm IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం అలా లైన్ లో ఉండగానే చిరు రెండు సాలిడ్ రీమేక్ చిత్రాలను కూడా తన లైన్ లో ఉంచుకున్నారు. అయితే వీటిలో దేనికి అదే భారీ అంచనాలు ఉండగా..

టాలెంటెడ్ దర్శకుడు మోహన్ రాజాతో ప్లాన్ చేసిన మళయాళ హిట్ చిత్రం “లూసిఫర్” రీమేక్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. తెలుగు వెర్షన్ కు గాను ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్ ఫుల్ టైటిల్ ను రెడీ చేస్తున్నట్టుగా టాక్.

మరి ఈ చిత్రానికి గాను “కింగ్ మేకర్” అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాగా ఉండే ఈ చిత్రానికి అది అయితే కరెక్ట్ గా ఉంటుందని ఫిక్స్ అయ్యారేమో కానీ ఇప్పుడు అయితే ఈ టాక్ బయటకు వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమో అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :