“పుష్ప” నుంచి సాలిడ్ అప్డేట్ వస్తుందా..?

Published on Mar 31, 2021 7:02 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ ఫిల్మ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా గత కొన్నాళ్ల నుంచి ఓ సాలిడ్ అప్డేట్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరి టైం దగ్గర పడుతుండడంతో బన్నీ ఫాన్స్ బన్నీ బర్త్ డే గిఫ్ట్ కోసం మేకర్స్ ను అడుగుతున్న క్రమంలో వారి నుంచి కూడా సానుకూల సమాధానమే వస్తుంది. సో డెఫినెట్ గా బన్నీ బర్త్ డే కి మైత్రి మూవీ మేకర్స్ సరైన బహుమతినే అందించే ప్లాన్ లో ఉన్నారని అర్థం అవుతుంది. మరి అదేంటో తెలియాలి అంటే కాస్త ఓపిక పట్టక తప్పదు.. ఇక ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :