ఆరోజున “అఖండ” నుంచి సాలిడ్ అప్డేట్.!?

Published on May 8, 2021 10:16 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా “అఖండ” అనే సాలిడ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య మాస్ దర్శకుడు బోయపాతో శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన టైటిల్ రివీల్ టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో కూడా చూస్తూనే ఉన్నాము.

అయితే ఇప్పుడు అఖండ నుంచి నందమూరి అభిమానులుకు సూపర్బ్ ఫీస్ట్ ఇచ్చే అప్డేట్ రానున్నట్టు దానికి డేట్ కూడా ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. ఆ అప్డేట్ మరేదో కాదు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ కోసమే.. ఇది వచ్చే మే 28న మేకర్స్ విడుదల చెయ్యనున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం ఆల్బమ్ పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి థమన్ ఎలాంటి క్రాకింగ్ ఆల్బమ్ ఇచ్చాడో చూడాలి.

సంబంధిత సమాచారం :