ఎన్టీఆర్ విలనీ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించిందట

Published on Nov 17, 2019 7:28 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన చిత్రం జై లవకుశ. 2017లో దర్శకుడు కె ఎస్ రవీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కించగా హిట్ మూవీగా నిలిచింది. నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇన్నోసెంట్ బ్యాంకు ఎంప్లాయ్ గా, దొంగగా మరియు నెగిటివ్ షేడ్స్ కలిగిన నాయకుడిగా మూడు విభిన్న పాత్రలలో ఎన్టీఆర్ నటించారు. నివేదా థామస్, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటించడం జరిగింది. కాగా ఈ చిత్రంలోని ఓ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

ఎన్టీఆర్, నివేద థామస్ ల మధ్య వచ్చే ‘నీకళ్ళలోని కాటుక ఓ నల్లమబ్బుకాగా….’సాంగ్ యూట్యూబ్ లో 100మిలియన్ వ్యూస్ కి చేరుకుంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ సాంగ్ రెండు బాణీలలో సాగడం గమనార్హం. ఆహ్లదంగా మొదలైన ఈ సాంగ్, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఎన్టీఆర్ తో మధ్యలో గంభీరంగా సాగుతుంది. ఈపాటకు టాలీవుడ్ ఏస్ లిరిక్ రైటర్ చంద్ర బోస్ సాహిత్యం అందించారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More