వరుణ్ తేజ్ నెక్స్ట్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌తో లింక్ ఏమిటో తెలుసా..?

వరుణ్ తేజ్ నెక్స్ట్ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్‌తో లింక్ ఏమిటో తెలుసా..?

Published on Feb 23, 2026 4:00 PM IST

Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాడు. ఆయన హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్టుల విషయంలో మరిన్ని సర్ప్రైజ్‌లను సిద్ధం చేస్తు్న్నట్లు తెలుస్తోంది.

టాప్ డైరెక్టర్ అట్లీ శిష్యుడు బాలాజీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక ఎంటర్‌టైనర్ చేయబోతున్నాడట. బాలాజీ చెప్పిన కథ వరుణ్ తేజ్‌కు బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. విశేషమేమిటంటే, టాలెంటెడ్ కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. కథలోని ప్లాట్ మరియు కొత్తదనం నచ్చడంతో కార్తీక్ సుబ్బరాజ్ తన ‘స్టోన్ బెంచ్ క్రియేషన్స్’ ద్వారా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కానున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు