చరణ్ పై ఓ స్పెషల్ భారీ యాక్షన్ సీక్వెన్స్.!

Published on Apr 12, 2021 12:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సాలిడ్ లైనప్ ఉన్న సంగతి తెలిసిందే. మరి వాటిలో రెండు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రాల్లో చరణ్ ఏకకాలంలో నటిస్తున్నాడు. రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే మరో భారీ మెగా మల్టీ స్టారర్ లో నటిస్తున్నాడు. అయితే ఈ ఆచార్య లో చరణ్ రోల్ పై మరిన్ని ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే కొరటాల “సిద్ధ” రోల్ లో చరణ్ ను పవర్ ఫుల్ గా ప్రొజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలా మరో సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ ను చరణ్ పై ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా ఇది మాంచి హై వోల్టేజ్ గా ఉంటుందని తెలుస్తుంది.

కొరటాల సినిమా అంటేనే ఓ బెంచ్ మార్క్ ఫైట్ సీన్ పక్కా.. మరి చరణ్ తో ఎలాంటిది ఈ సినిమాలో ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇక ఈ చిత్రంలో చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మెగాస్టార్ చిరు కి కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటెర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :