వెంకీ మామ మ్యూజికల్ నైట్ అట..!

వెంకీ మామ మ్యూజికల్ నైట్ అట..!

Published on Dec 10, 2019 2:21 PM IST

వెంకీ మామ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు మ్యూజికల్ నైట్ నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం 6:00 గంటల నుండి హైదరాబాద్, ఫిల్మ్ నగర్ నందు గల జే ఆర్ సి కన్వెన్షన్ హాల్ నందు ఈ మ్యూజికల్ ఈవెంట్ జరగనుంది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ నేతృత్వంలో వెంకీ మామ మూవీ పాటలపై గ్రాండ్ గా ఈవెంట్ జరగనుంది. ఆసక్తిగలవారు తమ పాసులు బుక్ చేసుకోవలసిందిగా చిత్ర యూనిట్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. లెజెండరీ నిర్మాత రామానాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన వెంకీ మామ విషయంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇటీవలే ఖమ్మంలో గ్రాండ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అటు వెంకటేష్ అభిమానులతో పాటు, అక్కినేని అభిమానులు హాజరైసందడి చేశారు. ఇక వెంకీ మామ ట్రైలర్ యూట్యూబ్ నందు టాప్ 3 లో ట్రెండ్ అవుతుంది. వెంకీ మామ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 13న వెంకీ మామ విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు